
తొలి శుభోదయం :-
టంగుటూరు మండలంలోని కారుమంచి గ్రామానికి చెందిన దామవరపు అరవింద్ 2019 సంవత్సరంలో చీరాలకు చెందిన వహీద (26 సంవత్సరాలు) అను ఆమెను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి అరవింద్ వహీదలు కారుమంచి గ్రామంలో కాపురం ఉంటున్నారు. ఈ క్రమంలో దామవరపు వహీదాకు తన భర్త సంపాదన కుటుంబ పోషణకు సరిగా సరిపోకపోవడం వలన మరియు వహీదాకు గత కొంతకాలం నుండి కడుపులో నొప్పిగా ఉంటున్నట్లు, తన భర్త అరవింద్ పలుమార్లు హాస్పిటల్ లో చూపించినట్లు, సదర విషయం వహీద తన తల్లిదండ్రులతో చెప్పగా వాళ్లు పలుమార్లు చీరాల నుండి వచ్చి వహీద ను చూసి వెళుతూ ఉన్నట్లు, వహీద తల్లి అయిన మస్తాన్ బి కూడా పెద్ద హాస్పిటల్ లో చూపిస్తాలే అని చెప్పినట్లు, సదరు దామవరపు వహీద తేదీ 15.10.2025 న ఉదయం తనకి విపరీతమైన కడుపు నొప్పి రావడం వలన సదరు కడుపునొప్పి భరించలేక ఇంటిలో ఉన్న ఎలుకల పేస్టును తిన్నది. అది గమనించిన వహీదా భర్త అయిన అరవింద్ చికిత్స నిమిత్తం ఒంగోలులోని ప్రకాశం హాస్పటల్ నందు చేర్చినాడు. తరువాత వహీద 16-10-2025న ఒంగోలు ప్రకాశం హాస్పటల్ నందు చికిత్స పొందుతూ చనిపోయినట్లు డ్యూటీ డాక్టర్ గా తెలియజేశారు. సదర విషయము గురించి వహీదా తల్లి టంగుటూరు పిఎస్ నందు రిపోర్ట్ చేయగా, కేసు నమోదు చేసి నారు. టంగుటూరు M.R.O గారు ఒంగోలు జిజిహెచ్ నందు శివపంచనామా నిర్వహించినారు.