
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్లో ఉన్న పి.టి.ఎస్ కన్వెన్షన్లో టిడిపి నాయకులు దేవత మహానంద – శ్రీమతి మల్లేశ్వరి గార్ల కుమారుని వివాహ మహోత్సవానికి దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు హాజరయ్యారు.
నూతన వధూవరులు భరత్ తేజ – వెంకట లక్ష్మి సాత్వికలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ , మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు , సొసైటీ అధ్యక్షులు శేఖర్ పంతులు , మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు , మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు , టౌన్ అధ్యక్షులు చిన్న , కోట హనుమంతరావు , బొగ్గవరేపు సుబ్బారావు , టిడిపి నాయకులు మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.