
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
రానున్న వేసవి ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా RWS, మున్సిపల్ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మార్కాపురం లోని కలెక్టరేట్లో గురువారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి మార్కాపురం జిల్లాలో ఎక్కడెక్కడ నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, వాటి పరిష్కార మార్గాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. సమస్యను దృష్టిలో ఉంచుకొని అవసరమైన పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు . అదేవిధంగా క్షేత్రస్థాయిలో తిరిగి సమస్యలను అంచనా వేసుకొని తగు చర్యలు చేపట్టాలన్నారు . వేసవిలో గ్రామాలు, పట్టణాల్లో నీటి సమస్యలు తర్వాత కుండా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో RWS ఈఈ సురేష్ బాబు, డిపిహెచ్ఇఓ శ్రీనివాసరావు, గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ రమణ బాబు, ఇతర మున్సిపల్ ఏఈ లు పాల్గొన్నారు.