
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరు, కందుకూరు గ్రామదేవత ఆదిపరాశక్తి శ్రీ శ్రీశ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం ఈరోజు శుక్రవారం ఎంతో వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, చందన అభిషేకం, కుంకుమభిషేకం నిర్వహించి అమ్మవారిని కన్నుల పండుగగా అలంకరించారు. అమ్మవారికి అష్టోత్తరం కుంకుమ పూజ నిర్వహించారు. గణపతి రాజు వెంకట శేషగిరిరావు ధర్మపత్ని. లలిత గార్లు ఉభయ దాతలుగా వ్యవహరించారు. కుటుంబ సభ్యులు నరసింహారావు ధర్మపత్ని శిరీష. , శ్రీ నందన్, యాగ ప్రియ హాసిని కలసి ఈరోజు కలసి ఉభయ దాతలగా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. సాయంత్రం మహిళా భక్తులు లలితా సహస్రనామ పారాయణం ఆలపించారు. సాయంత్రం అమ్మవారికి పల్లకి సేవ ఎంతో వైభవంగా నిర్వహించారు. పల్లకి సేవ ముందు పడమటి పాలెం మహిళలు, శ్రీ సరస్వతీ నిలయం నటరాజ నాట్యమండలి చిన్నారుల కోలాటం భక్తులను ఆకట్టుకుంది. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
