
కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత
తొలి శుభోదయం న్యూస్ తాడేపల్లి:-
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైయస్ జగన్కు అందజేసి, వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు.వైయస్ జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వధూవరులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.