
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
మహిళలు, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య హై స్కూల్ లో శక్తి యాప్ మరియు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు శక్తి యాప్ ఉపయోగం, అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయం పొందే విధానం గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ భావనను సులభంగా అర్థమయ్యేలా వివరిస్తూ, వ్యక్తిగత భద్రత, శరీర పరిమితులపై అవగాహన కల్పించారు.విద్యార్థులు ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ధైర్యం, భద్రతపై చైతన్యం పెరుగుతుందని పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.