
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, టంగుటూరు ప్రాంతంలో నిర్వహించిన తెప్పోత్సవం వేడుకలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో బందోబస్తు విధులు నిర్వహించారు.ఉత్సవ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని వ్యూహాత్మకంగా మోహరించి, గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే స్కై ఐ ప్రకాశం పోలీస్ ప్రాజెక్ట్ పరిధిలో డ్రోన్ నిఘా ద్వారా నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తూ, ఎలాంటి అనుకోని ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నారు.ప్రజలు మరియు భక్తులు పోలీసులకు పూర్తి సహకారం అందించడంతో తెప్పోత్సవం శాంతియుతంగా విజయవంతంగా ముగిసిందని జిల్లా పోలీసులు తెలిపారు.
