
దర్శి పట్టణ శివారులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన దర్శి పోలీసులు
సరైన పత్రాలు లేని 67 మోటార్‌సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తొలి శుభోదయం ప్రకాశం:-
శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఇంచార్జి ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు దర్శి డిఎస్పి బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దర్శి పట్టణ శివారులోని శివరాజ్ నగర్ ఏరియాలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ సెర్చ్ లో దర్శి సీఐ వై. రామారావు సర్కిల్ పరిధిలోని దర్శి, ముండ్లమూరు, కురిచేడు, దొనకొండ ఎస్సైలు మరియు దర్శి ట్రాఫిక్ ఎస్ఐ ఎం మురళి కె కమలాకర్ శివ మరియు త్యాగరాజు, భాషా లు అలాగే సుమారు 50 మంది పోలీసు సిబ్బందితో కలిసి శివరాజ్ నగర్ ను జల్లెడ పట్టడం జరిగింది.ఈ తనిఖీల్లో భాగంగా ముఖ్యంగా గంజాయి గురించి, అలాగే మత్తు పదార్థాల గురించి తనిఖీలు చేయడం జరిగింది. శివరాజ్ నగర్ ప్రాంతానికి సంబంధించిన అన్ని ఇళ్లలో తనిఖీలు చేపట్టి, సరైన డాక్యుమెంట్లు మరియు నంబర్ ప్లేట్లు లేనటువంటి 67 వాహనం గుర్తించి, ఆ వాహన యజమానులకు కొంతమందికి చలనాలు వేయటం అలాగే రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం కూడా జరిగింది.తదనంతరం దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిఐ మరియు ఎస్సైలు మరియు సిబ్బంది అందరూ కలిసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో స్థానిక శివరాజ్ నగర్ ప్రజలందరినీ మమేకం చేసి శివరాజ్ నగర్ లోని రోడ్ల నందు గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీని కూడా నిర్వహించి, తదుపరి అక్కడి యువత, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు, ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు, గంజాయిని పారదులుదాం"అంటూ ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది.గంజాయి మరియు మాదకద్రవ్యాలు వినియోగం వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం మొత్తం నష్టపోతుందని అధికారులు వివరించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువు, క్రీడలు, ఉపాధి వంటి సానుకూల మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
