
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
గత రాత్రి శ్రీ గుంటి గంగా భవాని అమ్మవారి 101వ వార్షికోత్సవ తిరునాళ్ల సందర్భంగా, దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ , డా. లలిత్ సాగర్ గార్ల దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దైవ ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాస రెడ్డి కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు డా. గొట్టిపాటి లక్ష్మీ – లలిత్ సాగర్ గార్లను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.