
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును పురస్కరించుకుని బాపట్ల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు, వేగేశన ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి సహకారంతో, వేగేశన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు.ఈ సేవా కార్యక్రమాన్ని వేగేశన ఫౌండేషన్ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు తనయుడు శ్రీ వేగేశన రాకేష్ వర్మ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.