
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
పొలిట్ బ్యూరో లో స్థానం కల్పించిన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గార్లకు ధన్యవాదాలు.కూటమి ప్రభుత్వ పాలనలలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో అమలు అవుతున్నాయి.కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుంది. ఇందుకూరు పేట మండలం మైపాడు సమీపంలోని కృష్ణాపురం గ్రామంలో జరిగిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేక కార్యక్రమలో కోవూరు ఎమ్మెల్యే మరియు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల అండగా ఉంటుందన్నారు. తనను తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవి అయిన పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమించడం పట్ల ఆమె తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటి మంత్రి నారా లోకేష్ గార్లకు ధన్యవాదాలు తెలిపారు.