
క్రీడలే ఆరోగ్యానికి పునాది కూనపురెడ్డి వెంకట సుబ్బారావు
తొలి శుభోదయం సింగరాయకొండ:-
సంక్రాంతి సందర్భంగా బ్యాడ్మింటన్ నాన్–మెడలిస్ట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహణ
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అయిత రామయ్య శ్రేష్ఠి – గడ్డం వీర రాఘవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సింగరాయకొండలోని ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులో నాన్–మెడలిస్ట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించారు.ఈ టోర్నమెంట్‌కు కొండేపి నియోజకవర్గ పరిధిలోని పొన్నలూరు, మర్రిపూడి, కొండేపి, జరుగు మల్లి, తంగుటూరు, సింగరాయకొండ మండలాల నుంచి మరియు ఇండోర్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లలో
ప్రథమ బహుమతి – రాహుల్, చిన్న
ద్వితీయ బహుమతి – శ్రీనివాస్, ఉబేదుల్లా (మున్నా)
తృతీయ బహుమతి – చంద్ర, అశోక్
చతుర్థ బహుమతి – పృథ్వీరాజ్, మల్లికార్జున
విజేతలుగా నిలిచారు.
మెమెంటోను చల్ల అంకరాజు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు మరియు కూనపరెడ్డి రెడ్డి వెంకట సుబ్బారావు, న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు హాజరై క్రీడాకారులను అభినందించారు. వారు మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం మరియు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ టోర్నమెంట్‌కు
మొదటి బహుమతి వేల్చూరి వెంకట రమేష్ బాబు 7000/-
రెండవ బహుమతి కొణిజేటి వెంకట సుధాకర్ 5000/-
మూడవ బహుమతి 3000/- మహబూబ్ బాషా
నాల్గవ బహుమతి బాలు 2000/- అందించగా,
ఆటగాళ్ళకు భోజన వసతి చల్లా గోపి, నాగసూరి వెంకట సుబ్బారావు,ఉబేదుల్లా,షేక్ బీబ్ జాన్ లు కల్పించారు.కార్యక్రమానికి సహకారం అందించిన దాతలకు,చందు సప్లయర్స్ వారికి నిర్వాహకులు శ్రీనివాస్ ప్రత్యేకంగా కృతజ్ఞతలతో గుర్తించారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో, క్రీడాస్ఫూర్తితో విజయవంతంగా ముగిసింది
