
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం:-
బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ 45వ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్నాను.దేశభక్తి, దైవభక్తి, క్రమశిక్షణ అనే మూడు సూత్రాల ఆధారంగా నైతిక విలువలతో కూడిన విద్యాభ్యాసం జరగాలని ఆకాంక్షిస్తున్నాను. విద్యా రంగం వ్యాపారమయమైన నేటి రోజుల్లో కూడా నామమాత్రపు ఫీజులతో నాణ్యమైన, సంస్కారవంతమైన విద్యను అందిస్తున్న సరస్వతి శిశుమందిర్ నిర్వాహకులను అభినందనలు. విద్యార్థులు చదువు కోసం కేటాయించే ప్రతి నిమిషం వారి భవిష్యత్తుకు పునాది అని తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన నిరుత్సాహపడకుండా ఓటమిని ఒక పాఠంగా మార్చుకుని ముందుకు సాగాలని తెలియజేస్తున్నాను. సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు పెడదారి పట్టకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ, పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారిని ప్రేమతో గమనించాలని తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు సూచిస్తున్నాను.
