
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :-
మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టంగుటూరు మండలం కందులూరు గ్రామం సర్పంచ్, వార్డు నెంబర్లుగా అభ్యర్థులుగా 12 వార్డులకు గాను 11 వార్డులు, ఒక సర్పంచ్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి గ్రామ ప్రజలకు సేవ చేస్తూ తమ పదవికి న్యాయం చేస్తూ నిరంతరం ప్రజలతో ఉంటూ చెరగని ముద్ర వేసుకొని ముందుకు సాగుతున్న నేపథ్యంలో వారి యొక్క పదవి కాలం ఏప్రిల్ 02 ముగుస్తున్న సందర్భంగా కందులూరు గ్రామ పార్టీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర టియుసి కార్యదర్శి మన్నం వెంకయ్య గారు, మండల మాజీ ఉపాధ్యక్షులు, Ex ఎంపీటీసీ,ఉప్పలపాటి శివరామరాజు , రామశెట్టి దాసయ్య గారు వారి ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డు నెంబర్లు వీడ్కోలు - సన్మాన కార్యక్రమం జరిగినది..ముందుగా రాజ్యాంగ నిర్మాత పెద్దాయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చితపటానికి పూలమాలతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన నాయకులు టంగుటూరు వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు చింతపల్లి హరిబాబు పాల్గొన్నారు.చింతపల్లి హరిబాబు ప్రసంగిస్తూ గ్రామ అభివృద్ధికి శ్రీమతి పసుమర్తి ఈశ్వరమ్మ సేవలు మరువలేనివని తెలిపారు.
అనంతరం సర్పంచు ఈశ్వరమ్మ గారితో పాటు 11 వార్డు సభ్యులు అందరికీ శాలువతో పూలమాలతో ఘనంగా సత్కరించి మెమెoటో అందజేశారు. మహిళలకు చీరలు అందించారు ఈ కార్యక్రమంలో పసుమర్తి ఆనంద్, పామర్తి ఆ శేఖర్ వికలాంగ నాయకులు పసుమర్తి రాజేష్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కందులూరు గ్రామ ప్రజలు, వివిధ అనుబంధ విభాగ అధ్యక్షులు, అందరూ పాల్గొన్నారు.