
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :-
ప్రజల శాంతిభద్రతలు, సామాజిక క్రమశిక్షణను పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాల తొలగింపు కార్యక్రమాలను కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. స్థానిక ప్రజల సహకారంతో వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఈ చర్యలు చేపట్టారు.SN పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగమూరు గ్రామంలో స్థానికుల సహకారంతో ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాలను తొలగించారు. అలాగే ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కొల్లూరుపాడు ఫ్లై ఓవర్ ప్రాంతంలో ప్రజల సహకారంతో ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై చర్యలు తీసుకున్నారు.మర్రిపూడి ఎస్సై ఆధ్వర్యంలో Visible Policing నిర్వహిస్తూ, ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాల శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. అదే విధంగా పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కందుకూరు రోడ్డులోని మిర్చి యార్డు సమీపంలో కూలీల సహకారంతో ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాలను తొలగించారు.కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ ప్రాంతంలో, అలాగే కొండపి పట్టణ శివార్లలో కూడా ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాలను శుభ్రపరచడం జరిగింది. ఈ చర్యల ద్వారా యువత తప్పుదారులు పడకుండా చూడడం, మహిళలు మరియు స్థానిక ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారాన్ని అందిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే శాంతియుత సమాజం సాధ్యమని జిల్లా పోలీస్ అధికారులు పేర్కొన్నారు.