
తొలి శుభోదయం కందుకూరు:-
ఫిబ్రవరి 12వ తేదీ జరుగు దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ, ఏఐటియుసి నాయకులు కార్మికుల్లోకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే వీర రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు ఉపయోగపడే చట్టాలను కుదిస్తూ ప్రజా సంక్షేమాన్ని మరిచి కార్పొరేటర్లకు ఉపయోగపడే చట్టాలను చేస్తుందని ఆయన అన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను తొలగించి వాటి స్థానంలో నాలుగు కోడ్లను తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీ సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని ఆయన అన్నారు. సిపిఐ కందుకూరు నియోజకవర్గం కార్యదర్శి బి సురేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీన వామపక్ష పార్టీలు ప్రజాసంఘాలు రైతు సంఘాలు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు కే మురళి, వై ఆనంద్ మోహన్ మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెలో కార్మికులను కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయడానికి కార్మికులకు సన్నద్ధం కావాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎం లక్ష్మీనారాయణ, కే రాము, పి కోటేశ్వరరావు, బి బాల బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.