
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో సింగరాయకొండలో నకిలీ మద్యం విక్రయాలను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించబడింది.సురేష్ గారి క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా కుటీర పరిశ్రమల మాదిరిగా నడుస్తున్న నారా వారి నకిలీ మద్యం వ్యాపారంపై ప్రజల ప్రాణాలు రక్షించాలనే ఉద్దేశంతో ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మదాసి వెంకయ్య, డా. బత్తుల అశోక్, కొండేపి నియోజకవర్గానికి చెందిన 6 మండలాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నకిలీ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టాలని, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.