
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండలోని కాకతీయ కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నాను. ఉలవపాడు మండలం ఉలవపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓగుబోయిన యాదాద్రి - మస్తానమ్మ దంపతుల ప్రత్యేక ఆహ్వానం మేరకు వారి కుమారుడు శ్రీకాంత్ యాదవ్ - సౌజన్యల వివాహ మహోత్సవానికి హాజరై, నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశాను. వివాహ బంధంతో ఒక్కటైన ఈ నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.