
తొలి శుభోదయం ప్రకాశం:-
సింగరాయకొండ సర్కిల్లో సీఐ హాజరత్తయ్య ఆధ్వర్యంలో టెక్నికల్ అసిస్టెంట్లు, రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు మరియు కోర్ట్ కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించబడింది.ఈ సందర్భంగా సీఐ సర్కిల్ పరిధిలోని పరిపాలనా పనులు, రికార్డ్ సంరక్షణ, కేసుల వ్యవహారాలు, కోర్టు ప్రక్రియలు, ప్రజా సేవల వేగవంతతపై వివరణాత్మక సూచనలు అందించారు.పోలీస్ సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాలని సూచించారు.