
తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని RTC బస్టాండ్ సెంటర్లో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న సైబర్ మోసాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతాయి, వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాలను పోలీసులు వివరించారు. తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, OTPలు లేదా బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పకూడదని, అనుమానాస్పద కాల్స్‌కి స్పందించకూడదని సూచించారు. ఏదైనా సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రజలలో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు.