
తొలి శుభోదయం కందుకూరు:-
రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సిపిఐ స్థూపాలకు ముప్పు లేదని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు సోమవారం దివంగత కమ్యూనిస్టు ఉద్యమకారుడు కామ్రేడ్ ఒలేటి రాఘవులు భార్య కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు తో పాటు నాయకులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును కలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కోటేశ్వరమ్మ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అధికారులు స్థాపం కొంత భాగం తొలగిస్తామని పేర్కొంటున్నట్లు వివరించారు స్పందించిన ఎమ్మెల్యే స్థూపానికి ఏం కాదని ముందు పక్క పారి గోడ కొంత భాగం రహదారి విస్తరణలో పోతుందని కాంటాక్ట్ కు చెప్పించి ఆ పారి గోడ నిర్మిస్తానని పేర్కొన్నారు ఉద్యమకారుల ఉద్యమాలను త్యాగాలను గౌరవిస్తానని అలాంటి ఉద్యమకారులు త్యాగాలకు జ్ఞాపకాలైన తోపాలకు ఇబ్బంది రాకుండా చేస్తానని మరోసారి స్పష్టంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నో కలిసిన వారిలో సిపిఐ నాయకులు ఆనందమోహన్ ఉప్పుటూరు మాధవరావు చంద్రమోహన్ దుర్గాప్రసాద్ మురళి నరసయ్యరామ్మూర్తి తదితరులు ఉన్నారు