
తొలి శుభోదయం కందుకూరు:-
మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై గుంటూరులో చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.ఈ సందర్భంగా పలువురు మహిళా నాయకులు, పార్టీ ప్రముఖులు మాట్లాడుతూ.. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ అంబటి రాంబాబును పోలీసులు తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం లేదా పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో, తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఈ సందర్భంగా ఘాటుగా హెచ్చరించారు.
