
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
ఇన్ లీగల్ గా ఎల్ఈడి లైట్లు వాహనాలకు ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య వాహనదారులను హెచ్చరించారు. శనివారం కొమరోలు బీసీ కాలనీలో ఎస్సైలు, నాగరాజు, కోటేశ్వరరావు లతో కలిసి కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిలో కొన్నిటికి జరిమానా విధించినట్లు సిఐ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివారణ పై సీఐ అవగాహన కల్పించారు. అవసరమైన ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ ప్రజలకు సూచించారు. ఇక సైబర్ నేరాలు, ఓటిపి ఫ్రాడ్స్ , హెల్మెట్ పై ప్రజలకు అవగాహన కల్పించి మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు గంజాయికి దూరంగా ఉండాలన్నారు….