
తొలి శుభోదయం ఒంగోలు :-
ఉద్యోగ విరమణ పొందాక శేష జీవితాన్ని మంచి ఆరోగ్యంతో సుఖంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ
పోలీసు శాఖలో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన పిసి పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యం.రామచంద్రారెడ్డి HC.2344, 35 సర్వీస్ బుధవారం ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో చేరినప్పటి నుండి నేటి వరకు ప్రజలకు సేవ చేస్తూ ఉద్యోగ విరమణ పొందడం అదృష్టమన్నారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో కుటుంబానికి దూరంగా ఉండి విధులు నిర్వహించారని, జిల్లా పోలీస్ శాఖకు అందించిన సేవలను శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. గతంలో క్యాష్ రివార్డ్స్ -45,GSE -3, అతి ఉత్కృష్ట సేవ పతకం- 1, సేవాపతకం -1 పొందివున్నారు. సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, మిగిలిన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు. పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని, భవిష్యత్తులో వారికి ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామిరెడ్డి, ఎఆర్ఎస్సై తిరుపతి స్వామి, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.