
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ లోని స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి గౌరవనీయులు డెంటిస్ట్ సుస్మిత సింగ్ మరియు ప్రముఖ న్యాయవాది ధనలక్ష్మి ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించి, పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించడం జరిగినది. అదేవిధంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మహిళ సాధికారత మరియు విద్య గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన డాక్టర్ గీతా రాణి మాట్లాడుతూ, మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు సమాజ నిర్మాణానికి మూల స్తంభాలని,విద్య, వైద్యం, విజ్ఞానం, క్రీడలు, రాజకీయాలు వంటి అనేక రంగాలలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళల గొప్పతనం, వారి శక్తి సామర్ధ్యాల గురించి ప్రేరణాత్మకమైన ప్రసంగం చేశారు. మహిళల సాధికారతకు విద్యే బలమైన ఆయుధమని,ప్రతి అమ్మాయి ధైర్యం మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.