
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి నియోజకవర్గంలో పరిశుభ్రతకు కొత్త దిశగా అడుగులు పడుతున్నాయి. దర్శి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఐదు మండలాలకు ఐదు స్వచ్ఛ రథం వాహనాలను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమం ‘స్వచ్ఛ రథం’ ప్రధాన లక్ష్యం ఇంటింటి నుండి ప్లాస్టిక్, పాత కాగితాలు వంటి పొడి వ్యర్థాలను సేకరించడం అని తెలిపారు. సేకరించిన వ్యర్థాలకు బదులుగా ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతను పెంచడంతో పాటు, వ్యర్థాలను ఆదాయంగా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దర్శి, కురిచేడు మండలాల ఎంపీడీఓలు కల్పన , సత్యప్రసాద్ , తాళ్లూరు డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు , దర్శి మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ శ్రీరామమూర్తి ,
సొసైటీ అధ్యక్షులు కలువకొలను చంద్రశేఖర్ , ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు ,మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు , టౌన్ పార్టీ అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ మరియు ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు.స్వచ్ఛ రథం – పరిశుభ్రమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన జీవనం వైపు మరో ముందడుగు!