
తొలి శుభోదయం న్యూస్ అద్దంకి:-
హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కృషి చేయాలని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి, ఏ విధంగా సోకుతుంది మరియు సుఖ వ్యాధులు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి అనే విషయాలను ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి వి సాగర్ పేర్కొన్నారు సోమవారం అద్దంకి మండలం సింగరకొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ సింగరకొండ తిరుణాల సందర్భంగా దేవాలయానికి విచ్చేసే భక్తులకు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ,దిషా ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్, మరియు సుఖ వ్యాధులు నిర్మూలన కొరకు అవగాహన కలిగించే స్టాల్ మరియు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన భక్తులకు కరపత్రాల ద్వారా వాల్ పోస్టుల ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డి దుర్గా సురేంద్ర స్టాల్ ను సందర్శించిన వారికి తప్పని పరిస్థితుల్లో బయట వ్యక్తులతో శృంగారంలో పాల్గొనేటప్పుడు తప్పనిసరిగా కండోమ్ వాడాలని కండోమ్ ఏ విధంగా వాడాలి కండోమ్ లేకుండా విచ్చలవిడి శృంగారంలో పాల్గొంటే వచ్చే సుఖ వ్యాధుల గురించి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గురించి వివరించడం జరిగినది ఎవరైనా హెచ్ ఎయిడ్స్ వ్యాధి పైన సుఖ వ్యాధులు పైన తగు సూచనలు సలహాలు కొరకు జాతీయ టోల్ ఫ్రీ 1097 కు సమాచారం తెలియజేసి వారి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని రోజురోజుకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి చాప కింద నీరు లాగా సమాజంలో రోగుల సంఖ్య పెరుగుతుందని ఇది చాలా బాధాకరమైన విషయం అని హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల మరణాలు తగ్గించాలంటే వారు క్రమం తప్పకుండా మందులు వాడుకునే విధంగా చూడాలని అంతేకాకుండా వారి పట్ల వివక్షత విడనాడాలని పేర్కొన్నారు ఈ ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ జై సింహడాక్టర్ శ్రీ హర్ష ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అద్దంకి, కోరిసపాడు ఔట్రిచ్ వర్కర్లు టి దుర్గా భవాని, డి హర్షిత, ఆర్ కృష్ణవేణి ఏ. ఎన్ ఎం మౌనిక పి. ఈ లు వి మల్లేశ్వరి సంధ్యారాణి, శివ పార్వతి పార్వతి పాల్గొన్నారు….