
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో, జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రత కోసం సమగ్ర అవగాహన కార్యక్రమంను నిర్వహించింది.ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాల పాటింపు, సైబర్ నేరాల నివారణ, మహిళలు మరియు బాలికలపై నేరాల నివారణ వంటి కీలక అంశాలపై ప్రజలకు వివరమైన అవగాహన కల్పించారు.హెల్మెట్ వినియోగం ప్రాణరక్షకం – బైక్ రైడర్, పైలియన్ ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.ట్రాఫిక్ నియమాల పాటింపు – మద్యం సేవించి డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి ప్రమాదకర చర్యలు తప్పించాలని సూచించారు.సైబర్ క్రైమ్ అవగాహన – OTP, బ్యాంక్ వివరాలు, తెలియని లింకులు ఎవరికీ ఇవ్వకూడదని, ఏ అనుమానాస్పద కార్యకలాపం జరిగిన వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.మహిళలు–పిల్లల భద్రత – వేధింపులు, హరాస్మెంట్, సైబర్ బులియింగ్ వంటి సందర్భాల్లో వెంటనే డయల్ 100 / 1091 కి ఫిర్యాదు చేయాలని చెప్పారు.కార్యక్రమానికి ప్రజలు మంచి స్పందన ఇచ్చారు. ప్రజల సహకారంతోనే ట్రాఫిక్ ప్రమాదాలు, సైబర్ నేరాలు, మహిళలపై నేరాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు.
