
తొలి శుభోదయం ప్రకాశం:-
విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మరి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నాలుగో తారీఖు నిర్వహించనున్న బందుకు సహకరించాలని ముందస్తుగా సింగరాయకొండ మండల కేంద్రంలో ఉన్న స్కూల్స్‌కు బందు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది….. నాలుగో తారీఖు సింగరాయకొండ నందు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని… ఈ ప్రభుత్వం వెంటనే విద్యా రంగంలో విద్యార్థి సంఘాలు గుర్తించినటువంటి ప్రధానమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ బంద్ అనేది ఆరంభం మాత్రమేనని…. భవిష్యత్తులో విద్యారంగ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలియజేస్తూ అందరూ నాలుగో తారీఖు బందుకు సహకరించాలని కోరడం జరుగుతుంది.