google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

జిల్లా పోలీసుల ముమ్మర గస్తీ… ఏటీఎంలు, లాడ్జిలు,ప్రధాన వ్యాపార కేంద్రాలపై ప్రత్యేక నిఘా
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లా వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం…నేరాల నియంత్రణే, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారి ఆదేశాలతో నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది రాత్రి వేళల్లో గస్తీ విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం రాత్రి దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ గారి పర్యవేక్షణలో స్పెషల్ పార్టీ సిబ్బంది వెపన్ (తుపాకీ)తో ఒంగోలు పట్టణంలో విస్తృతంగా గస్తీ నిర్వహిస్తూ నైట్ పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తున్నారు. దొంగతనాలు, ఇతర నేర సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలపై క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.జిల్లాలోని ఏటీఎంలు, బ్యాంకులు మరియు ప్రధాన వ్యాపార కేంద్రాల వద్ద భద్రతా చర్యలను మరింత ముమ్మరం చేస్తూ, ఏటీఎం కేంద్రాల వద్ద పోలీసులు నిరంతర గస్తీ నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పరిశీలిస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్స్ ఆల్రెడీ చేస్తూన్నారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించడంతో పాటు, వాహనాలను తనిఖీ చేసి వాటి రవాణా వివరాలను సేకరిస్తున్నారు. పాత నేరస్తులు, చెడునడత కలిగిన వ్యక్తులు మరియు అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి, మొబైల్ చెక్ డివైసుల ద్వారా వారి వివరాలను తనిఖీ చేస్తున్నారు. జిల్లాలో ఎటువంటి నేరలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిఘా మరియు గస్తీ చర్యలు చేపట్టారు. లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అక్కడ ఉండే వారి ఆధార్ వివరాలను పరిశీలించి నమోదు చేస్తున్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.నేర నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే దిశగా, రాత్రి వేళల్లో అల్లర్లు, గొడవలు, దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ, కారణం లేకుండా తిరిగే ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
