google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి నియోజకవర్గంలో ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం నిర్వహించిన విజయోత్సవ సభకు విశేష స్పందన లభించింది. దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ నాయకత్వంలో నిర్వహించిన ఈ సభలో వేలాదిగా ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.సభకు ముఖ్య అతిథులుగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, నియోజకవర్గ పరిశీలకులు రాఘవేంద్ర, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ తదితరులు హాజరయ్యారు. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, మండల అధ్యక్షులు, మున్సిపల్ ప్రతినిధులు పాల్గొన్నారు.కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు కూడా హాజరయ్యారు. దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు, మహిళలు, యువత, బూత్ ఇన్చార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు ప్రజలకు వివరించారు. సభ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.