google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం, బింగినపల్లి గ్రామము నందు APAIMS 2.O నూతన యాప్ ద్వారా యూరియా మరియు డి.ఎ.పి ఎరు FCవులను ఎలా తీసుకోవాలి , తీసుకోవడానికి ప్రాథమికంగా అనుసరించవలసిన విషయాలు గురించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ ఈ .నిర్మలా కుమారి పాల్గొని రైతులకు పలు సూచనలు ఇవ్వడం జరిగినది. ఎరువులు కావలసిన రైతులు ముందుగా గ్రామ సహాయకుల ద్వారా వారు సాగుచేసిన పంట వివరాలను యాప్ నందు నమోదుచేసి తదుపరి మాత్రమే ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లాలని సూచించారు.కొత్త విధానంలో రైతులకు సులభతరంగా ఎరువులను అందించడానికి వ్యవసాయ శాఖ పూర్తి ప్రణాళికతో ఉన్నదని తెలియజేశారు. అనంతరం గ్రామంలో రైతులతో కలిసి APAIMS 2.O యాప్ గురించి రైతులకు అవగాహన నిమిత్తం ర్యాలీ నిర్వహించడం జరిగినది. తదుపరి సహాయ వ్యవసాయ సంచాలకులు , సింగరాయకొండ కార్యాలయంలో సింగరాయకొండ సేవా కేంద్రం సిబ్బందికికార్యక్రమానికి , సింగరాయకొండ మండల ఎరువుల దుకాణ డీలర్స్కు,APAIMS 2.0 యాప్ మీద ట్రైనింగ్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి సింగరాయకొండమండల వ్యవసాయ అధికారి టీ పూర్ణచందర్రావు , రైతు సేవా కేంద్రం సిబ్బంది, సింగరాయకొండ రిటైల్ డీలర్స్ పాల్గొనుట జరిగినది