google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవాధికారి కమిటీ చైర్మన్ శ్రీ కే.కే.వి బులికృష్ణ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
జాతీయ లోక్ అదాలత్ జూలై 11వ తేదీన కందుకూరు కోర్టు నందు మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నదని జాతీయ లోక్ అదాలత్ నందు ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టవలసిందిగా కందుకూరు సీనియర్ సివిల్ జడ్జి గారు పోలీస్ మరియు అడ్వకేట్స్ మీటింగ్ లో మాట్లాడుతూ తెలియజేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రెవెన్యూ, బ్యాంక్, బిఎస్ఎన్ఎల్, మున్సిపల్ అధికారులు ఎక్కువ కేసులు పరిష్కారమయేందుకు చూడాలని కందుకూరు సీనియర్ సివిల్ జడ్జి కం మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ శ్రీ కే.కే.వి బులికృష్ణ గారు తెలిపారు. కోర్టుల వరకు వెళ్ళని ఫ్రీ లిటిగేషన్ కేసులను కూడా పరిష్కరించు కోవలసినదిగా తెలియజేశారు. కోర్టులోని అన్ని రకముల సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భరణం కేసులు, గృహహింస కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, పరిష్కరించబడతాయని ఈ ప్రకటనలో తెలియజేశారు. ఈ అవకాశమును కక్షిదారులు అందరూ సద్వినియోగం చేసుకోవలసినదిగా సీనియర్ సివిల్ జడ్జి గారు తెలిపారు. జూలై 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కందుకూరు కోర్టు నందు జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశమును కక్షిదారులు అందరూ సద్వినియోగం చేసుకొని కేసులు త్వరితగతిన పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి
D. దుర్గా కళ్యాణి గారు, అడిషనల్ మున్షిప్ మేజిస్టేట్ L.అన్నపూర్ణ శ్రీ గారు, కందుకూరు సబ్ డివిజనల్ DySP Ch. V.బాల సుబ్రహ్మణ్యం గారు, కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి శ్రీధర్ నాయుడు గారు సీనియర్, జూనియర్ మరియు మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
