google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు పట్టణం నందు 50 మంది దివ్యాంగుల లబ్ధిదారులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీ వాహనాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి వర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు , దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు , విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంస్థ చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి గారు , జిల్లా కలెక్టర్ శ్రీ రాజా బాబు గారు , ఒంగోలు శాసనసభ్యులు శ్రీ జనార్దన్ గారు , కనిగిరి శాసనసభ్యులు శ్రీ ఉగ్ర నరసింహ రెడ్డి గారు , దర్శి టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి , ఎంపీ మాగుంటి శ్రీనివాసులురెడ్డి , సంతనూతలపాడు శాసనసభ్యులు విజయకుమార్ , కందుకూరు MLA నాగేశ్వరరావు , ఓడా చైర్మన్ రియాజ్ , జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో చైర్మన్ గారితో పాటు జిల్లా ఏడీ గారు , శారీరక దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా కమిటీ ,దివ్యాంగ సంఘాల నాయకుడు శ్రీ సాయి , దివ్యాంగ సంఘాల నాయకులు , దివ్యాంగ ఉద్యోగులు , లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..