google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఒంగోలులో శుక్రవారం జరిగిన భారీ ట్రాక్టర్ నిరసన ర్యాలీకి టంగుటూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో, 120 ట్రాక్టర్లతో పెద్ద సంఖ్యలో రైతాంగం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టంగుటూరి రాము మాట్లాడుతూ, తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పొగాకు రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, క్వింటాకు 36 వేల రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు వేజెండ్ల సింగయ్య, శివరామకృష్ణ, శ్రీకాంత్, మొలకలపల్లి కోటేశ్వరరావు తదితరులు మండలంలోని వివిధ గ్రామాల రైతులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.