google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ నగరంలో పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల భాగస్వామ్యంతో నగర అభివృద్ధి లక్ష్యాలపై అందరకి అవగాహన వుండాలి అన్ని తెలియజేసారు. స్వచ్ఛమైన, సుందరమైన ఒంగోలు నిర్మాణం ద్వారానే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించగలమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఒంగోలును పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఒంగోలు నగరంలో నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడంతో పాటు నగరంలో సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఒంగోలు రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నడం జరిగినది.