google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రకాశంజిల్లా జిల్లా ఒంగోలు లోని కలెక్టరెట్ నందు గల DRO గారి చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులతో సమావేశం జరిగింది, జిల్లా ఇంచార్జి DRO మాధురి లత గారి ఆధ్వర్యంలో జరిగింది, ఇంచార్జి DRO గారు మాట్లాడుతూ జిల్లా లో ప్రస్తుతం పోలింగ్ స్టేషన్లు పెరిగాయి,జిల్లా లో 1649 నుండి 1725 పోలింగ్ స్టేషన్ల కు అంటే 76 కి పెరిగాయి,ఒంగోలు నియోజకవర్గం 259 నుండి 271 కి అంటే 12 పోలింగ్ స్టేషన్లు పెరిగాయి అని తెలిపారు,SIR కార్యక్రమం జరుతున్నదని ప్రకాశం జిల్లా లో ఇళ్ల గణన పూర్తి అయ్యిందని, ప్రస్తుతం జరుగుతున్న SIR కార్యక్రమం ద్వారా రెండు, మూడు ఓట్లు ఉన్న వారివి తొలిగిపోవటం జరుగుతుందని, అలానే జిల్లా లోని అన్ని నియోజకవర్గలలో చనిపోయిన వారి ఓట్లు ఈ SIR కార్యక్రమం తో తొలిగిపోతాయని తెలిపారు,అలానే ప్రతి ఓటరు BLO లు మీ ఇంటికి వచ్చి మీ ఓటును నమోదు చేసుకునే టప్పుడు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, వాళ్ళు అడిగిన నమోదు పత్రాలు ఉంచుకోవాలని తెలిపారు, వైసీపీ నాయకుడు దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ జిల్లా లో , అలానే నగరంలో డోర్ నెంబర్లు కొన్ని చోట్ల వెయ్యలేదని అవి వెయ్యి కుండా SIR కార్యక్రమం ఏ విదంగా చేస్తున్నారని ప్రశ్నించారు , ప్రస్తుతం SIR కార్యక్రమం లో అధికార పార్టీ వారి ప్రలోభాలకు లొంగి నిజమైన ఓటర్ల ఓటును తొలిగిస్తే ఆ ఓటరు యొక్క భారతదేశం పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని , దేశ పౌరసత్వం పొతే ఆ పౌరుడు విదేశాస్తుడుగా దేశంలో వున్న సౌకర్యాలు ఏవి అతనికి వచ్చే పరిస్థితి కోల్పో్తాడని,ఉద్యోగం కావాలన్న, రేషన్ కార్డు, పింఛను, ఏ పథకం రాదని,స్కూల్స్ లో గాని కాలేజీలలో చేరాలన్న అర్హత కోల్పోతాడు, కనుక అధికార పార్టీ వారి స్వార్థ ప్రలోభాలకు లొంగి ఓట్లు తొలిగించవద్దని కోరారు, ప్రతి ఓటర్లను 2 ఫోటో లు అడుగుతున్నారు, ప్రతి ఓటరు తమ ఫోటోలు ఫోటో స్టూడియో కెల్ల తీయించుకొని ఇవ్వాలంటే 300/- రు ఖర్చు అవుతున్నది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 300 చొప్పున అందరు తీయించుకునే పరిస్థితి లేదని, ఈ భారాన్ని ఓటరు భరించే పరిస్థితి లేదు కనుక ఎన్నికల సంఘం వారు ఫోటో గ్రాఫర్ పెట్టే ఫోటోలు తీసే కార్యక్రమం చెయ్యాలని కోరారు, ఒక కుటుంబం లో చనిపోయిన వారు ఉంటే వారి వారి ఓటును తొలించడానికి డెత్ సర్టిఫికెట్ BLO లు అడుగుతున్నారని , ప్రస్తుతం ఒక డెత్ MRO ఆఫీస్ నుండి గాని కార్పొరేషన్ మరియు మునిసిపల్ ఆఫీస్ పోయి సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే ఒక్కో సర్టిఫికెట్ కు 10000 నుండి 15000 లంచం ఇవ్వందే వచ్చే పరిస్థితి లేదని, డెత్ సర్టిఫికెట్ లేకుండా చనిపోయిన వారి ఓట్లను తొలిగించే ఏర్పాటు చెయ్యాలని క్రాంతికుమార్ కోరారు, అలానే ప్రతి రోజు BLO ఉదయం నుండి ఎన్ని గంటలకు సర్వేకి తిరుగుతారో వైసీపీ పార్టీ BLA లకు ముందురోజే తెలపాలని కోరారు…వైసీపీ రాష్ట్ర నాయకుడు దామరాజు క్రాంతికుమార్ ప్రశ్నించారు , ఈ కార్యక్రమం లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మరియు అధికారులు ,స్పెషల్ కలెక్టర్లు యర్రగొండపాలెం ,ERO లు ,జిల్లా ఎలక్షన్ సెల్ సూపరంటెండ్ శ్రీనివాసరావు, MRO లు,పొలిటికల్ పార్టీల ప్రతినిధులు వైసీపీ తరుపున దామరాజు క్రాంతికుమార్,వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ,జిల్లా వైసీపీ ఎలక్షన్ సెల్ రీప్రజెటీటివ్, కాంగ్రెస్ రసూల్ ,టీడీపీ అంకరాజు ,బీజేపీ గుర్రం సత్యం, BSP రవికుమార్, సిపిఎం రఘురామ్,,జిల్లా DT రాజశేఖర్ రెడ్డి,ఎలక్షన్ ఆఫీస్ నుండి ఉపేంద్ర ఒంగోలు mro ఆఫీస్ , సలోమి,పాల్గొన్నారు.