google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
జూన్ 17న చీరాలలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టీమ్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో సింగరాయకొండకు చెందిన ప్రముఖ చెస్ క్రీడాకారుడు సయ్యద్ షఫీజ్ ప్రతిభ చాటారు. ప్రకాశం జిల్లా తరఫున పోటీల్లో పాల్గొన్న షఫీజ్ మొత్తం 7 రౌండ్లలో 4 విజయాలు సాధించి టోర్నమెంట్లో 25వ స్థానంలో నిలిచారు.అంతేకాకుండా, ఈ పోటీల్లో పాల్గొన్న ప్రకాశం జిల్లా క్రీడాకారులలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.సింగరాయకొండకు చెందిన యువ క్రీడాకారుడు రాష్ట్రస్థాయి పోటీల్లో మరోసారి తన ప్రతిభను చాటడంతో స్థానికులు, చెస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.