google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ పి.రాజాబాబు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు శ్రావణిరెడ్డి, పలువురు నేతలు మాలకొండపై యాగశాల వెనుక 5.6 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం అంతకుముందు, శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, అమ్మవార్లను దర్శించుకోగా, ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు.MLA నాగేశ్వరావు మాట్లాడుతూ….ఈ రెండేళ్లలో మాలకొండ దేవస్థానం అభివృద్ధికి సుమారు 10 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. భక్తుల సౌకర్యం కోసం అదనపు వసతి గదులు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణం, కొండపైకి మెట్లమార్గం అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు త్వరలోనే మొదలవుతాయన్నారు. ఇంకా 1.75 కోట్ల రూపాయలతో అన్న ప్రసాద భవనం అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.