google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో ఆదివారం ఉదయం యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోర్టు సివిల్ జడ్జి డాక్టర్ వి. లీల శ్యాంసుందరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సన్నెబోయిన శ్రీనివాసులు మాస్టర్ ట్రైనర్‌గా వ్యవహరించి యోగా ఆసనాలు, ప్రాణాయామ విధానాలను ప్రదర్శించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని ఆయన వివరించారు. ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామ సాధన చేశారు. కార్యక్రమం అనంతరం యోగా వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
