google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:-
పొన్నలూరు మండలంలోని పొన్నలూరు గ్రామంలో రైతన్న మీకోసం (ఆర్ ఎం కే )కార్యక్రమం మండల వ్యవసాయధికారి వి రాము ఆధ్వర్యంలో జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సహాయ వ్యవసాయ సంచాలకులు సింగరాయకొండ డా. ఈ. నిర్మల కుమారి పాల్గొని, మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంలో మేలైన వ్యవసాయ సాంకేతిక పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించడమే దీని ఉద్దేశం అని తెలిపారు. రైతులు డిమాండ్ ఆధారిత పంటలు వేసుకోవాలని మరియు నీటిని ఆదాచేసే తక్కువ కాలపరిమితి గల పంటలను వేసుకొని ఎల్ నినో ప్రభావం ద్వారా వర్షాబావ పరిస్థితుల వలన నీటిని ఆదాచేసుకోవాలని,వరి పంటను తగ్గించి తక్కువ కాల పరిమితి గల పంటలను వేసుకుని పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు, అలాగే రైతులు ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా నమోదు చేసుకొని ప్రభుత్వ వ్యవసాయ పధకాలు మరియు విత్తనాలు ఎరువులు లాంటి 15 రకాల సేవలు యాప్ లో అందుబాటులో ఉన్నాయని కావున సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచుకోవచ్చని తెలియజేసారు. ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా ఈ సంవత్సరం నుండి రైతులకు రిటైల్ డీలర్లు మరియు రైతు సేవా కేంద్రాలలో వారి గ్రామ వ్యవసాయ సహాయకులు సవరించిన పంటలు మరియు విస్తీర్ణం బట్టి యూరియా మరియు డి.ఎ.పి ఎరువులు కొనుగోలు చేసుకోవచ్చని తెలియజేసారు.
మండల వ్యవసాయ అధికారి వి. రాము మాట్లాడుతూ మండలంలో పచ్చి రొట్ట ఎరువులు అయిన జనుములు 50% రాయితీతో 173 క్వింటాలు రైతుల పేర్లు నమోదు చేసి, పంపిణీ చేస్తున్నట్లు మరియు సహాయ వ్యవసాయ సంచాలకుల ద్వారా రైతులకు జనుములు పంపిణీ చేసినట్లు తెలియజేసారు ఇంకా కావలసిన రైతులు సంబందిత రైతు సేవా కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవాలని తెలియజేసారు, ప్రతీ రైతు ఖరీఫ్ లో సాగుచేసిన పంటలను ఈ పంట నందు పంట నమోదు చేసుకోవాలని తెలియజేసారు. అలాగే ప్రకృతి వ్యవసాయ అధికారిణి (ఎఫ్. ఎం. టి ) డి. మందాకిని మాట్లాడుతూ ప్రధాన పంట వేసే ముందు తొలకరి వర్షము పడే ముందు (పీఎండీస్) ప్రి మూన్సూన్ డ్రై సౌయింగ్ నవ ధాన్యాలను (10-20 రకాల విత్తనాలు ) భూమిలో వేసుకోవడం వలన భూసారం వృద్ధి చెంది,సేంద్రియ మరియు కర్బన శాతం పెరుగుతుంది అని, తేమ శాతం వృద్ధి చెంది బెట్ట పరిస్థితితులలో మొక్క వర్షభావ పరిస్థితితుల నుండి తట్టుకుంటుంది అని తెలియజేసారు. ప్రస్తుతం 100 కిట్లు రైతులకు పంపిణీ చేయుటకు సిద్ధంగా వున్నవి అని, కావలసిన రైతులు ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి తీసుకోవచ్చని తెలియజేసారు. పై కార్యక్రమంలో పొన్నలూరు నీటి సంఘం అధ్యక్షులు మండవ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి ఈ.సుధీర్ కుమార్, పొన్నలూరు గ్రామ వ్యవసాయ సహాయకులు టి.వి.వెంకట నారాయణ,గ్రామ నాయకులు మండవ మురళి,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది యు. అనూష,పి.లక్ష్మి ప్రసన్న మరియు రైతులు పాల్గొన్నారు.