google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :-
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ సర్ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు బి ఎల్ వో లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు ఓ పంచాయతీ సెక్రటరీని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత సస్పెండ్ చేశారు.సర్ కార్యక్రమంలో విధులు సక్రమంగా నిర్వహించపోవడంతో పాటు, అధికారుల ఆదేశాలను ధిక్కరించడంతో వారిపై చర్యలకు ఉపక్రమించారు. షోకాజు నోటీసులు వచ్చిన వారిలో మార్కాపురం పట్టణంలోని 2,5,12 సచివాలయాలకు చెందిన బిఎల్వోలు డి పెద్ద మస్తాన్, ఎస్ కే సల్మా, ఎం శ్వేత, మార్కాపురం రూరల్ లోని భూపతి పల్లి రాయవరం -1 సచివాలయాలకు చెందిన జి మహేష్ రెడ్డి, కే శ్రీనివాసరావు, జి ఆంజనేయులు ఉన్నారు. ఇప్పటికైనా బిఎల్వోలు పద్ధతి మార్చుకొని సక్రమంగా పనిచేయాలని కలెక్టర్ హెచ్చరించారు.