google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో గిద్దలూరు నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలతో BC బాలుర గురుకుల పాఠశాల మంజూరు కావడం పట్ల గిద్దలూరు ఎమ్మెల్యే గౌరవ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో అభినందనీయమని తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గానికి BC బాలుర గురుకుల పాఠశాల స్కూల్ మంజూరు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఈ పాఠశాల మంజూరుకు సహకరించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారికి ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.