google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయం మేనేజ్మెంట్ కమిటీ (VMC) సమావేశం జిల్లా కలెక్టర్ మరియు విద్యాలయ కమిటీ చైర్మన్ శ్రీ పి. రాజాబాబు గారి అధ్యక్షతన ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమావేశం జరిగింది.ఈ సందర్భంగా విద్యాలయం గత విద్యా సంవత్సరంలో 10వ, 12వ తరగతుల్లో సాధించిన ఫలితాలు, క్రీడా విజయాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్ అవకాశాలపై నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీ సి. శివరాం గారు వివరించారు.జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు మాట్లాడుతూ జవహర్ నవోదయ విద్యాలయ అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం తరఫున ఎల్లప్పుడూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.