google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ గారు జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ సిబ్బందికి ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ మరియు ప్రజా భద్రతా విధులపై ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నియమాల అమలు, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ప్రమాదాల నివారణ చర్యలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం వంటి అంశాలపై సిబ్బందికి సమగ్ర సూచనలు అందించారు.అదేవిధంగా ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ట్రాఫిక్ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేయాలని సూచించారు. బ్రీఫింగ్ అనంతరం సిబ్బందిని వారి విధులకు అనుగుణంగా కేటాయించిన ప్రాంతాలకు పంపించి ట్రాఫిక్ నియంత్రణ మరియు ప్రజా భద్రతా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు.