google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
కోత ముక్క పేకాట పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.. 3 మంది పట్టివేత, 2 ఫోన్లు మూడు మోటార్ సైకిళ్ళు స్వాధీనం. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఎస్సై చెంచయ్య , ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా మరియు సిబ్బంది దాడి.కోత ముక్క పేకాట నిర్వహణపై ఒంగోలు టాస్క్ఫోర్స్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కందుకూరు రూరల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో పలుకూరు గ్రామ పొలాల్లో మధ్య నిర్వహించిన దాడిలో అక్రమంగా కోతముక్క పేకాట నిర్వహిస్తున్న3 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు 3మోటర్ సైకిల్ 20570/- నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. వారిని తదుపరిచాడు నిమిత్తం కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం అయినది.