google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కే.కే.వి బులికృష్ణ
మండల న్యాయ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక తిక్కవరపు రామిరెడ్డి కళాశాల నందు కందుకూరు మండల లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నియంత్రణ చట్టాలపై ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సుని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల న్యాయ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి కే.కే.వి. బులికృష్ణ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వలన జరిగి అనర్ధాలు గురించి విద్యార్థులు ముందే తెలుసుకొని వాటికి దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పోకూరి కోటయ్య, షేక్ జమీర్ ప్రసంగిస్తూ మాదకద్రవ్యాల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.