google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
మొహర్రం పర్వదినం సందర్భంగా శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో మార్కాపురం జిల్లా పోలీసు ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ ద్వారా కనిగిరి పట్టణంలోని బొడ్డు చావిడి వద్ద నిర్వహించిన మొహర్రం శోభాయాత్రను డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించారు.గగనతలం నుంచి రియల్‌టైమ్ నిఘా నిర్వహిస్తూ ఊరేగింపు మార్గాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైన చోట పోలీసు సిబ్బందికి సూచనలు అందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించారు.ప్రజలు పరస్పర సామరస్యాన్ని పాటిస్తూ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, పోలీసులకు సహకరించాలని మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.