google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామం లో 3.5 కోట్ల ఖర్చుతో నిర్మించబడ్డ 33/11KV నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ను గౌరవ శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారు శాసనసభ్యులు కందుకూరు వారిచే ప్రారంభోత్సవం జరిగింది .
ఈ సబ్ స్టేషన్ నిర్మాణం ద్వారా ప్రస్తుతం ఉన్న ఫీడర్లపై లోడ్ తగ్గి సరైన వోల్టేజ్ ప్రొఫైల్ మెరుగుపడుతుంది విద్యుత్ సరఫరాలలో నాణ్యత పెరిగి దీనిద్వారా వ్యవసాయ కనెక్షన్లకు మెరుగైన సేవలు అందించబడతాయి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కట్టా వెంకటేశ్వర్లు SE, ఆపరేషన్ ఒంగోలు, అత్తంటి వీరయ్య EE ఆపరేషన్ కందుకూరు M. నాగేశ్వరరావు EE Constraction, ఒంగోలు P. యుగంధర్ ADE సింగరాయకొండ, T. సత్యనారాయణ ADE కన్స్ట్రక్షన్, కి.Y. రమేష్ AE కన్స్ట్రక్షన్ , P. సాయిబాబు AE ఉలవపాడు , డివిజన్లోని ఏఈలు మరియు విద్యుత్ సిబ్బంది , సర్పంచ్ శ్రీ బసవయ్య నాయుడు గారు మన్నేటికోట మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.