google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
మా స్మశానవాటికను భూ కబ్జాదారుల నుండి కాపాడాలని పట్టణ పరిధిలోని దివివారిపాలెం ఎస్టి కాలని యానాదులు శనివారం కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మశాన వాటిక ఉన్న ప్రాంతంలో హైవే నిర్మాణం జరగడంతో భూమికి విపరీతంగా ధరలు పెరిగాయని, దాంతో దివివారిపాలెం గ్రామానికి చెందిన అగ్రవర్ణ వ్యక్తి మా స్మశాన వాటికను దున్ని స్మశాన వాటిక లేకుండా చేశారని వారు కన్నేటి పర్యంతం అయ్యారు. గత 20 సంవత్సరాలుగా అక్కడే మాకుటుంబ సభ్యులు మరణిస్తే కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. కబ్జా చేసిన వ్యక్తిని అడిగితే పైన ఉండే పొలం నాది అయినప్పుడు కింద పొలం కూడా నాదే అవుతుంది అడిగేదానికి మీరు నాకు నచ్చినట్లు నేను చేసుకుంటానని బెదిరిస్తున్నారని వారు తెలిపారు. మా స్మశాన వాటికను కాపాడి మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ ను కోరారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. స్పందించిన సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మీరు ఇచ్చిన అర్జీని పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కందుకూరు నియోజకవర్గం కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఎస్టీ యానాదులు సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు చేవూరు దుర్గాప్రసాద్, ఎస్టి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.